ప్రాణాలు తీసిన గుంత..
దంతాలపల్లి మండల కేంద్రం శివారు ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై గుంత ప్రమాదకరంగా ఉంది. గత ఏడాది జూలై 5వ తేదీన గుంతను తప్పించబోయి ఓ కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో వెలికట్టె గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్, మండలంలోని బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన పగిండ్ల కుమార్, వాల్యా తండాకు చెందిన నరేశ్ మృతి చెందగా మరో ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన సంబంధిత శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో మళ్లీ ఈ గుంత ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment