రోయింగ్ పోటీలకు హేమంత్
కేసముద్రం: ఛండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో ఈ నెల 22నుంచి 27వరకు జరగనున్న ఆల్ ఇండియా ఇంటర్ వర్సిటీ రోయింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు కేసముద్రం స్టేషన్‌కు చెందిన నల్లగొండ హేమంత్ ఎంపికై నట్లు జేఎన్‌టీయూ(హెచ్) ఫిజికల్ డైరెక్టర్ నల్లగొండ అశోక్ శుక్రవారం తెలిపారు. హైదారాబాద్‌లోని లయోలా కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న హేమంత్ ఉస్మానియా యూనివర్సిటీ తరఫున పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.
విద్యుత్ పునరుద్ధరణకు ‘హైపర్’ ప్రణాళిక
నెహ్రూసెంటర్: ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాల కారణంగా నిలిచిన విద్యుత్ సరఫరాను తక్కువ సమయంలో పునరుద్ధరించేందుకు ‘హైపర్’ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జె.నరేశ్ శుక్రవారం తెలిపారు. హెడ్ క్వార్టర్స్‌లో అప్రమత్తంగా ఉంటూ.. సమాచారం అందిన వెంటనే వ్యూహాత్మకంగా విద్యుత్‌ను పునరుద్ధరించడమే లక్ష్యమన్నారు. వేగంగా విద్యుత్ పునరుద్ధరణ, పనులకు హైపర్ ప్రణాళిక ఉపయోగపడుతుందని తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థిక పురోగతి సాధించా లనే లక్ష్యంతో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించిందన్నారు. ఈ పథకం కింద నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ఆసక్తిగల యువత ఆన్‌లైన్‌లో సంబంధిత వెబ్‌సైట్‌లో శనివారం నుంచి ఏప్రిల్ 5వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
సీల్డ్ టెండర్లకు...
జిల్లాలో పంట రుణమాఫీ, రైతు భరోసా పథకం కింద ముద్రించిన లబ్ధిదారుల జాబితా ప్రింటింగ్ సరఫరా చేయడానికి ఏజెన్సీల నుంచి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.1,0000తో జిల్లా వ్యవసాయాధికారి పేరిట టెండర్ డీడీ తీయాలని చెప్పారు. శనివారం నుంచి ఈనెల 26వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటలకు టెండర్లు స్వీకరిస్తామన్నారు. ఈనెల 27న ఉదయం 11గంటలకు టెండర్ ఖరారు చేస్తామన్నారు. పూర్తి వివరాలకు జిల్లా వ్యవసాయ అధికారి 72888 94786, 72888 94780 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
విరగకాసిన తునికిపండ్లు
గంగారం: మండలంలోని అటవీ ప్రాంతంలో తునికి పండ్లు విరగకాశాయి. ఏజెన్సీ ప్రజలు పండ్లను సేకరించి అమ్ముకుంటారు. అలాగే పండ్లను ఎండబెట్టి రెండు, మూడు నెలల వరకు నిల్వ చేసి తింటారు. కాగా తునికి పండ్లు బాగా కాస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఇక్కడి ప్రజల నమ్మకం.
రోయింగ్ పోటీలకు హేమంత్
Comments
Please login to add a commentAdd a comment