టెన్త్ పరీక్షలు షురూ..
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శుక్రవారం జరిగిన తెలుగు పరీక్షకు 8,183 మంది విద్యార్థులు హాజరై.. పదకొండు మంది గైర్హాజరైనట్లు డీఈఓ రవీందర్‌రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా 144 సెక్షన్ విధించామని చెప్పారు. జిల్లా పరిధి పలు మండలాల్లోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయని, ఎక్కడ ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ జరగలేదన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లా కార్యాలయంలో విద్యార్థుల సందేహాల నివృత్తికి కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, 94925 85375 ఫోన్ నంబర్‌లో విద్యార్థులు సంప్రదించాలన్నారు.
కలెక్టర్ తనిఖీ...
మానుకోటలోనిప్రభుత్వ బాలుర పాఠశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని, ప్రతీ పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. మందులు, ఓఆర్‌ఎస్, వివిధ మెడికల్ కిట్లు ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. కాగా డీఈఓ రవీందర్‌రెడ్డి, ఏసీజీఈ మందుల శ్రీరాములు కురవి, కేసముద్రంలోని పలు పరీక్ష కేంద్రద్రాలను తనిఖీ చేశారు.
జిల్లాలో మొదటిరోజు ప్రశాంతం
8,183 మంది విద్యార్థులు హాజరు
పదకొండు మంది గైర్హాజరు:
డీఈఓ రవీందర్‌రెడ్డి వెల్లడి
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
టెన్త్ పరీక్షలు షురూ..
టెన్త్ పరీక్షలు షురూ..
టెన్త్ పరీక్షలు షురూ..
Comments
Please login to add a commentAdd a comment