పనుల్లో వేగం పెంచాలి
మహబూబాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. కూలీలు వంద శాతం పనులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈజీఎస్‌లో జరుగుతున్న పనులు ఈనెల 31లోపు పూర్తి కావాలన్నారు. అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీసీలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఆర్‌డీఓ మధుసూదన్, రాజు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment