పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్..
దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం జిల్లా పరిషత్ పాఠశాలలో 70 మంది విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు లేవు. దీంతో గత ప్రభుత్వం మన ఊరు–మన బడి కార్యక్రమంలో పాఠశాలను ఎంపిక చేసింది. నిధులు మంజూరు చేసినట్లు అధికారులు ప్రకటించారు. పనులు ప్రారంభించిన తర్వాత బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేశాడు. దీంతో విద్యార్థులు పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలోని మూత్రశాలకు వెళ్తున్నారు. అక్కడ ఉన్న 65 మంది విద్యార్థులకు తోడు హైస్కూల్ విద్యార్థులు రావడంతో మూత్ర విసర్జనకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment