కేయూ క్యాంపస్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. గురువారం మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో క్యాంపస్‌లోని ఆడిటోరియంలో ‘రూబిజెస్ట్– 2025’ ఉత్సవాలు నిర్వహిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యమన్నారు. తమ లక్ష్యాలు నెరవేరాలంటే కష్టపడి చదువుకోవాలన్నారు. రూబిజెస్ట్ కార్యక్రమం ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థుల్లో టెక్నికల్ ఈవెంట్స్‌లో ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. వ్యోమగామి సునీతా విలియమ్స్‌లా ధైర్యం, ఆత్మవిశ్వాసం అందిపుచ్చుకొని ఇంజనీరింగ్ విద్యలో రాణించాలన్నారు. అకడమిక్ కోఆర్డినేటర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘రూబిజెస్ట్– 2025’ ఉత్సవాలకు వివిధ కళాశాలల విద్యార్థులు తమ ఈవెంట్స్‌కు సంబంధించిన ప్రాజెక్టుల డెమోల ద్వారా ప్రతిభ చూపొచ్చన్నారు. ఉత్సవాల కన్వీనర్ సాయితరుణ్.. టెక్నికల్ ఫేస్ అండ్ కల్చరల్ ఫెస్ట్‌లో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం