ఎల్‌ఆర్‌ఎస్ రాయితీతో ప్రయోజనం
మహబూబాబాద్ అర్బన్: ఎల్‌ఆర్‌ఎస్ 25శాతం ఫీజు రాయితీతో ప్రజలకు ఎంతో ప్రయోజనం కలు గుతుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డీపీఓలు, డీటీసీపీఓలతో ఎల్‌ఆర్‌ఎస్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్ క్రమబద్ధీకరణ పత్రాలు అందజేయాలన్నారు. అనంతరం కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌పై క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు తీసుకొని, ప్రొసీడింగ్ కాపీలను వెంటనే అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వీడియో కాన్ఫ రెన్స్‌లో జిల్లా పంచా యతీ అధికారి హరిప్రసాద్, మున్సిప ల్ కమి షనర్లు శాంతికుమార్, రవీందర్, నరేశ్ రెడ్డి, ఉదయ్ కుమార్, డీటీసీపీఓ సాయిరామ్, డివిజనల్ పంచాయతీ అధికారులు పుల్లారావు, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment