నకిలీ పురుగు మందుల ముఠా అరెస్ట్
వరంగల్ క్రైం: ప్రముఖ కంపెనీల పేర్లతోపాటు గడువు తీరిన పురుగు మందులను రైతులకు అంటగడుతున్న ముఠాలోని ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.78లక్షల 63 వేల విలువైన నకిలీ పురుగు మందులు, మిషనరీ, ప్రింటింగ్ సామగ్రి, రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీన చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సన్‌ప్రీత్ సింగ్.. నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం వరంగల్ మట్టెవాడ బొడ్రాయి సమీపాన ప్రధాన నిందితుడు ఇరుకుళ్ల వేదప్రకాశ్ ఇంటిపై టాస్క్‌ఫోర్స్, మట్టెవాడ పోలీసులు, వ్యవసాయధికారులు సంయుక్తంగా దాడి చేశారు. ఇందులో ముగ్గురు నిందితులు సిద్ధిక్, రాజేశ్, సదాశివుడుని అదుపులోకి తీసుకుని పెద్ద మొత్తంలో నకిలీ, గడువు తీరిన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మట్టెవాడ పీఎస్‌లో విచారించారు. ప్రధాన నిందితుడు ఇరుకుళ్ల వేద ప్రకాశ్.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో స్థానిక వ్యాపారులు, పురుగు మందుల కంపెనీ ప్రతినిధి అయిన మరో నిందితుడు సిద్ధిక్ వద్ద కాలం తీరిన పురుగు మందులను కొనుగోలు చేసేవాడు. అలాగే, గడువు దాటిన పురుగు మందులతోపాటు, ఇద్దరు నిందితులైన ఆళ్ల చెరువు శేఖర్, విష్ణువర్ధన్, ప్రస్తుతం జైలులో ఉన్న ఆదిత్య నుంచి ప్రముఖ పురుగు కంపెనీలైన ధనూక, టాటా, రైల్స్, బెయర్, ఆడ్మాతోపాటు మరికొన్ని కంపెనీ పేర్లతో తయారు చేసిన నకిలీ పురుగు మందులు కొనుగోలు చేసేవాడు. ఈ విధంగా సేకరించిన గడువు తీరిన పురుగు మందులతోపాటు నకిలీ పురుగు మందులను ప్రభుత్వ అనుమతులు లేని మిగతా నిందితులకు విక్రయించాడు. ఈ నకిలీ పురుగు మందులను కొనుగోలు చేసిన నిందితులు.. వీటిని స్థానికంగా ఉన్న వ్యవసాయదారులకు విక్రయిస్తూ మోసగించేవారు. పోలీసులు అరెస్ట్ చేసిన ప్రధాన నిందితుడు ఇరుకుళ్ల వేదప్రకాశ్‌తో పాటు సదాశివుడు, రాజు ఆదిత్య గతంలోనూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ప్రధాన నిందితుడి సమాచారం మేరకు ఆళ్ల చెరువు శేఖర్, విష్ణువర్ధన్ గోదాములపై టాస్క్‌ఫోర్స్, మట్టెవాడ పోలీసులు దాడులు చేశారు. నిందితుల్లో విష్ణువర్ధన్ పరారీలో ఉన్నాడు. మరో వ్యక్తి ముద్దగుల ఆదిత్య హైదరాబా ద్ జైలులో ఉండగా.. మిగతా ఏడుగురు మట్టెవాడ కు చెందిన ఇరుకుల్ల వేదప్రకాశ్, లక్ష్మీపురానికి చెందిన మహ్మద్ సిద్ధిక్ అలీ, పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌బాద్‌కు చెందిన నూక రాజేశ్ అలియాస్ రాజు, కరీంనగర్‌కు చెందిన యల్లం సదాశివుడు, ములుగు జి ల్లా గోవిందరావుపేటకు చెందిన ఎండీ రఫీక్, ఏపీలోని ప్రకాశం జిల్లా మడుగుకు చెందిన ఆళ్ల చెరువు శేఖర్, దుగ్గొండికి చెందిన పొదిళ్ల సాంబయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపా రు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, ఇన్‌స్పెక్టర్లు గోపి, రాజు, ఎస్సైలు వంశీకృష్ణ, నవీన్, ఆర్‌ఎస్సై భాను ప్రకాశ్, ఏఏఓ సల్మాన్‌పాషా, టాస్క్‌ఫోర్స్ కానిస్టే బుళ్లు సురేశ్, సురేందర్, సాంబరాజు, శ్రీనివాస్, సతీశ్‌కుమార్, నాగరాజు పాల్గొన్నారు.
రూ.78 లక్షల 63 వేల విలువైన
మందులు, మిషనరీ, ప్రింటింగ్ సామగ్రి, రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సీపీ సన్‌ప్రీత్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment