ఆడుకుంటూ వెళ్లి అనంతలోకాలకు..
సంగెం: ఓ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి అనంతలోకాలకు చేరింది. నీటి తొట్టిలో పడి మృతి చెందింది. ఈ ఘటన సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని బులియాభన్ గ్రామానికి చెందిన రాజు మహాకూర్, రాణి దంపతులు బతుకుదెరువు నిమిత్తం మూడు నెలల క్రితం సంగెం మండలం ఆశాలపల్లికి వలస వచ్చారు. గ్రామ శివారులో బుజ్జయ్య చౌదరి ఇటుకబట్టీలో పనిచేస్తున్నారు. రాజుకు బబితా మహాకూర్ అనే ఏదాదిన్నర ఏకై క కూతురు ఉంది. ఈక్రమంలో తల్లి దండ్రులు శనివారం సాయంత్రం ఇటుక బట్టీలో పనిచేస్తుండగా వారి పక్కనే చిన్నారి బబితా ఆడుకుంటోంది. ఆడుకుంటూ అక్కడే ఉన్న నీటి తొట్టిలో పడింది. బబితను మరో కూలీ రశ్మీత పటేల్ చూసి కేకలువేయడంతో హుటాహుటిన బయటకు తీసి వెంటనే ఎంజీఎం తరలించి చికిత్స చేయిస్తుండగా అదే రోజు రాత్రి మృతి చెందింది. బతుకుదెరువు కోసం వస్తే ఏకై క కూతురు నీటితొట్టికి బలైందని ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటారు. ఈ ఘటనపై రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ ఆదివారం తెలిపారు.
నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి
● ఆశాలపల్లిలో ఘటన
● మిన్నంటిన వలస కూలీ దంపతుల రోదనలు
Comments
Please login to add a commentAdd a comment