
విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదోన్నతులు పొందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్, ఏఐ పాఠాలు బోధిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల అడ్మిషన్లు పెంచాలని, మధ్యాహ్న భోజనంలో లోపాలను తొలగించి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు పరిశీలించాలన్నారు. చదువుతో పాటు అన్నిరంగాల్లో ముందుండే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ అప్పారావు, ఏఎం ఆజాద్‌చంద్రశేఖర్, ఆర్పీలు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్‌రెడ్డి