
పాడి పరిశ్రమకు ప్రభుత్వం చేయూత
తొర్రూరు రూరల్: పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని డీసీఓ ఎన్. వెంకటేశ్వర్లు తెలిపారు. తొర్రూరు విజయ పాల శీతలీకరణ కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మండల శివారులోని ఆర్‌డబ్ల్యూఎస్ భవనంలో అంతర్జాతీయ సహకార సంవత్సర కార్యక్రమం చేపట్టారు. పాడి రైతులకు అధికారులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. విజయ డెయిరీ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కె.శ్రావణ్‌కుమార్, పాలకేంద్రం చైర్మన్ రాసాల సమ్మయ్యతో కలిసి డీసీఓ మాట్లాడారు. పాడి రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం, విజయ డెయిరీ సహకరిస్తుందన్నారు. విజయ డెయిరీ డీడీ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి వ రంగల్ జిల్లాలో మిల్క్‌పార్లర్లు, బల్క్ మిల్క్ చిల్లింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు పాడి పశువులకు నాణ్యమైన దాణా ఉత్పత్తికి పటిష్టమైన కార్యాచరణ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో పాలకేంద్రం మేనేజర్ బారి వెంకటనారాయణ, సొసైటీల అధ్యక్షులు శ్రీనివాస్, ప్రభాకర్‌రెడ్డి, మధు, సుధాకర్‌రెడ్డి, సుజాత, పాడి రైతులు పాల్గొన్నారు.