
మన్ననూర్: భారీగా నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నామని, కారు సీజ్ చేశామని ఎకై ్సజ్ ఎస్‌ఐలు బాల్‌రాజ్, సతీష్‌కుమార్ తెలిపారు. శనివారం మన్ననూర్–అమ్రాబాద్ ప్రధాన రహదారిలో తమ సిబ్బందితో కలిసి రహదారి తనిఖీలు నిర్వహించామని అన్నారు. ఈక్రమంలో మన్ననూర్ గ్రామానికి చెందిన కూరాకుల రాజు కారులో వస్తుండగా, అనుమానం వచ్చి వాహనాన్ని ఆపే క్రమంలో నిందితుడు వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యాడు. వాహనంలో 210 కేజీల నల్లబెల్లం, 50 కేజీల పటిక స్వాధీనం చేసుకున్నామని, అచ్చంపేట ఎకై ్సజ్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ సిబ్బంది నవీన్, బంతిలాల్ పాల్గొన్నారు.
1,019 అగుగుల
నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం 1,019 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. సమాంతర కాల్వ నీటిని నిలిపివేశారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 70, తాగునీటి అవసరాల కోసం 20 క్కూసెక్కులు నీటిని వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment