మహమ్మదాబాద్: మండలంలోని బల్సుర్‌గొండ గ్రామం బయట ఉన్న శివాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని 25తులాల వెండి, తులం బంగారం అపహరించినట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శివాలయంలో చోరీ చేశారు. శుక్రవారం ఉదయం కొందరు గ్రామస్తులు చూసి పెద్దలకు సమాచారం అందించారు. దీంతో అదే గ్రామానికి చెందిన గొల్ల అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
25తులాల వెండి, తులం బంగారం
అపహరణ
Comments
Please login to add a commentAdd a comment