
చిన్నరాజమూర్‌కి పోటెత్తిన భక్తులు
దేవాలయ
ప్రధాన ద్వారంవద్ద భక్తులు
దేవరకద్ర: చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి దేవాలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి దాసంగాలతో నైవేద్యాలను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. పలువురు భక్తులు ఆవులను, కోడేలను ఆలయానికి అందజేశారు. పోర్లు దండాలు, గండజ్యోతులతో ప్రదక్షిణలు చేశారు. కోనేరు వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. నీటిలోకి వెళ్లకుండా ప్రత్యేకంగా ఇనుప జాలీలతో కంచెను ఏర్పాటుచేశారు. దేవస్థానం వారు పులిహోర, లడ్డు ప్రసాదాలను విక్రయించారు. జాతరలో స్వీట్లు షాపులు, గాజులు, బొమ్మల షాపులు వెలిశాయి. జోరుగా వ్యాపారాలు కొనసాగాయి. రెండు వారాలు జాతర కొనసాగే అవకాశముంది. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దాసంగాలతో నైవేద్యాల సమర్పణ

చిన్నరాజమూర్‌కి పోటెత్తిన భక్తులు

చిన్నరాజమూర్‌కి పోటెత్తిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment