ఎన్నాళ్లకెన్నాళ్లకు..
డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు
ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తయింది. ఈ పరిశీలన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు కొనసాగింది. తాజాగా కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నియామక ఉత్తర్వులను వారం రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాధిత అభ్యర్థులు కాంట్రాక్టు ఎస్జీటీలుగా నియామకం కానున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 182 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ నూతన జిల్లాల వారీగానే పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతుండగా.. ఖాళీలను బట్టీ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
నారాయణపేట/మద్దూర్: డీఎస్సీ– 2008 నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్టు విధానంలో ఎస్టీటీలుగా వారం రోజుల్లోగా నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని బాధిత అభ్యర్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు 30 శాతం పోస్టులు ప్రత్యేకంగా డీఈడీ అభ్యర్థులకు కేటాయించడంతో బీఈడీ అభ్యర్థులు నష్టపోయారు. మెరిట్ జాబితాలో ఉన్నా.. ఉద్యోగాలు రాకపోవడంతో కోర్టుల చుట్టూ తిరుగుతూ వస్తున్నారు. 17 ఏళ్ల న్యాయ పోరాటం.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ కాంట్రాక్టు విధానంలో నియమించనున్నారు. అయితే వీరందరికీ సాధ్యమైనంత త్వరగా పోస్టింగ్ ఇవ్వాలని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసినా వివిధ కారణాలతో జ్యాపం జరుగుతూ వచ్చింది.
సర్టిఫికెట్ల పరిశీలన
ఫలించిన 17 ఏళ్ల ఎదురుచూపులు
హైకోర్టు ఉత్తర్వులతో పోస్టింగులు
కాంట్రాక్టు ఎస్జీటీలుగా అవకాశం
ఉమ్మడి జిల్లాలో 182 మందికి న్యాయం
Comments
Please login to add a commentAdd a comment