నిరంతరంగా పర్యవేక్షించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో ఎక్కడా తాగు, సాగు నీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆమె వీసీ నిర్వహించారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే, సత్వరమే పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ విద్యుత్ సరఫరా, డిమాండ్‌పై ఎస్‌పీడీసీఎల్ అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో రోజుకు సరాసరి విద్యుత్ వినియోగం 7.16 ఎంయూ ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రోజుకు సరాసరి వినియోగం 7.98ఎంయూగా ఉందన్నారు. జిల్లాలో క్రిటికల్ ఓవర్ లోడెడ్ సబ్‌స్టేషన్ ఒకటి, 13 కేవీ ఫీడర్లు 4, 11 కేవీ ఫీడర్లు 2, ఆరు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల పనులు ప్రగతిలో ఉన్నాయని, ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. 258 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ పనులు మార్చి నెలాఖరులోగా పూర్తి చేస్తామని వివరించారు. 94407 68923, 94910 61101 నంబర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం నాలుగు అత్యవసర విద్యుత్ వాహనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రాచీన కళలను ప్రోత్సహించాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26వ తేదీన జిల్లాకేంద్రం సింహగిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎదుట జనతా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శివపార్వతుల కల్యాణం నాటక ప్రదర్శన, సామూహిక లింగాష్టక, బిల్వాష్టక పారాయణం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వీటికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాచీన కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జనతా సేవా సమితి ప్రతినిధులు నారాయణ, జనార్దన్ గురుస్వామి, వి.దుర్వాసరాజు, సుధాకరాచారి, విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
హోటళ్లలో తనిఖీలు
పాలమూరు: జిల్లా కేంద్రంలో ఫుడ్‌సేఫ్టీ కంట్రోల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మంగళవారం నగరంలోని న్యూటౌన్‌లో ఉన్న పలు హోటళ్లను తనిఖీ చేశారు. ఓ టీ పాయింట్‌లో చాయపత్తి, బిస్కెట్ల శాంపిల్స్, ఓ హోటల్‌లో వెజిటబుల్ బిర్యానీ నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఓ మార్ట్‌కు సంబంధించి పలు రకాల తినుబండారాల నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు. అలాగే పరిశుభ్రంగా లేని హోటళ్లకు నోటీసులు అంటించారు. తనిఖీల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్‌కుమార్, శిక్షణ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత, కరుణాకర్ పాల్గొన్నారు.
నిరంతరంగా పర్యవేక్షించాలి
Comments
Please login to add a commentAdd a comment