అవినీతిమయం చేశారు..
రాజాపూర్‌లో నడుస్తున్న ఓ ప్రైవేటు స్కూల్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా టెన్త్ వరకు నడిపిస్తున్నారు. వేరే పాఠశాల తరఫున పరీక్ష రాయిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని ఓ కార్పొరేట్ విద్యా సంస్థపై ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం రూ.2 లక్షలు ఫైన్ వేశారు. వారితో అధికారులు కుమ్మక్కు కావడంతో ఆ ఫైన్ చెల్లించలేదు. కొందరు విద్యాశాఖను అనినీతిమయం చేశారు.
– ప్రశాంత్, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి
డిప్యూటేషన్‌లు రద్దు చేయాలి..
కొందరు స్వార్థం కోసం డిప్యూటేషన్లు తీసుకుని బదిలీ అయిన వారిని వెంటనే తొలగించాలని గతంలో యూటీఎఫ్ ఆద్వర్యంలో పలుసార్లు డీఈఓకు విన్నవించాం. ప్రతిసారి ఎంఈఓలకు చెప్పామని, కొంత మంది వెనక్కి పంపించామని చెబుతున్నారే గానీ వెనక్కి పంపించినట్లు దాఖలాలు లేవు. వెంటనే అనవసర బదిలీలు చేసిన వారిని వెనక్కి పంపించి విద్యార్థులకు అవసరం ఉన్న చోటకు సర్దుబాటు చేయాలి.
– వెంకటేష్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి
తీరు మార్చుకోవాలి
ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే రోజుల తరబడి ఫైల్స్‌ను పెండింగ్‌లో పెడుతున్నారు. అధికారుల తీరు మార్చుకోవాలి. అనధికారికంగా నడుపుతున్న ప్రైవేటు పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
– సంతోష్ రాథోడ్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు
విచారణ చేస్తాం..
ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చే విషయంలో పలువురు సిబ్బంది వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. పాఠశాలలకు అనుమతుల విషయంలో పూర్తి పారదర్శకంగా పరిశీలించి అనుమతులు ఇస్తాం. అధికారుల ఆదేశాల మేరకు అనవసర డిప్యూటేషన్లను రద్దు చేయాలని ఎంఈఓలకు సూచించాం. ఒక్క ఉపాధ్యాయురాలికే ఎందుకు మెమో ఇచ్చారనే విషయం ఎంఈఓకే తెలియాలి. – ప్రవీణ్‌కుమార్, డీఈఓ
●
అవినీతిమయం చేశారు..
అవినీతిమయం చేశారు..
Comments
Please login to add a commentAdd a comment