పాలకవర్గాలకే ‘సహకారం’ | - | Sakshi
Sakshi News home page

పాలకవర్గాలకే ‘సహకారం’

Published Sun, Feb 16 2025 12:48 AM | Last Updated on Sun, Feb 16 2025 12:46 AM

పాలకవ

పాలకవర్గాలకే ‘సహకారం’

అచ్చంపేట: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పాక్స్‌) పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వెలువడిన ఉత్తర్వులను ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులు అందుకొని పీఏసీఎస్‌లకు పంపించారు. ఎన్నికల ప్రక్రియకు ఆరు నెలల ముందే కసరత్తు మొద లుపెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ఊసేలేదు. దీంతో ప్రత్యేకాధికారుల పాలనా.. ప్రస్తుతం పాలకవర్గ పదవీకాలాన్ని పొడిగి స్తా రా అన్న సందేహాలకు తాజా ఉత్తర్వులతో తెరపడింది. 87 సొసైటీల పాలకవర్గాలు 6 నెలల పాటు కొనసాగనున్నాయి. డీసీసీబీ పాలకవర్గ పదవీకాలాన్ని కూడా పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీసీఎంఎస్‌కు సంబంధించి అంశం ఉత్తర్వుల్లో లేకపోవడం గమనార్షం. డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలకు మరో పదిరోజుల సమయం ఉండటంతో ఈలోగా డీసీఎంఎస్‌ పాలకవర్గ పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

హర్షాతిరేకాలు..

ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షుల పదవీకాలం శనివారంతో ముగిసింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సంస్థ (డీసీఎంఎస్‌) పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 20తో పూర్తవుతుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో డీసీసీబీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలోనూ పొడిగింపు..

బీఆర్‌ఎస్‌ హయంలోనూ 2018 ఫిబ్రవరి 4న పాలకవర్గాల పదవీకాలం ముగియగా ఆరు నెలల చొప్పున రెండుసార్లు పర్సన్‌ ఇన్‌చార్జ్‌ల పదవీకాలాన్ని పొడిగించారు. 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించారు. అంతకు ముందు కాంగ్రెస్‌ హయాంలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రెండేళ్లు, టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు మూడేళ్లపాటు పొడిగించారు.

సీఎంకు కృతజ్ఞతలు

పీఏసీఎస్‌ పాలకవర్గాల కాలపరమితి మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. మా విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని పెంచిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తమ్మల నాగేశ్వర్‌రావుకు కృతజ్ఞతలు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రైతులకు మరింత చేరువ చేసేందుకు సహకార వ్యవస్థను బలోపేతం చేస్తాం. – విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
పాలకవర్గాలకే ‘సహకారం’ 1
1/1

పాలకవర్గాలకే ‘సహకారం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement