ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోనీ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని విద్యా శాఖాధికారులు తెలిపారు. జిల్లాలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలకు 22, 483 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని, గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు నిర్వహించే మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, లైటింగ్, ఫర్నిచర్, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలను సవ్యంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్లు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, అదనపు ఎస్పీ రాములు, ఆర్డీఓ నవీన్, నగర కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి పార్థసారథి, డీఈఓ ప్రవీణ్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కౌసర్ జహాన్, వైద్య, విద్యుత్, ఆర్టీసీ, సమాచార, పోస్టల్ శాఖల అధికారులు హాజరయ్యారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయంలేకుండా చూడాలి
కలెక్టర్ విజయేందిర బోయి
Comments
Please login to add a commentAdd a comment