మనువాదుల కుట్రలను తిప్పికొట్టాలి
మహబూబ్‌నగర్ రూరల్: దేశంలోని కులాల, మతాల మధ్య అసమానతలు సృష్టిస్తూ పరిపాలన కొనసాగిస్తున్న మనువాదుల కుట్రలను తిప్పికొట్టాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అరుంధతి భవన్‌లో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగార్జున అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాన్‌వెస్లీ హాజరై మాట్లాడారు. భారతదేశానికి దిశానిర్దేశం చేసే విధంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి పొంచి ఉన్న మనువాద, మతోన్మాద ప్రమాదాన్ని ప్రతిఘటించడానికి ఒక విశాల ఐక్య మహోద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. దేశంలో మతోన్మాద పాలకులు పూలే–అంబేడ్కర్‌ను మొక్కుతూ వారి ఆశయాలను అణగదొక్కేలా పాలన చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మైనార్టీలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నా రన్నారు. అట్టడుగు వర్గాలైన దళితులు ఆత్మగౌరవం కాపాడాలన్న స్థానికంగా క్షేత్ర స్థాయిలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఎం.కుర్మయ్య, మనోహర్, కుమార్, సురేష్‌కుమార్, గోపి, రాధాకృష్ణ, సంపత్, దినాకర్, రాంమ్మూర్తి, ప్రకాష్ కారత్, జిల్లా అధ్యక్షుడు మాణిక్యం రాజు, నాయకులు వెంకట్రాములు, బాలరాజు, శంకర్, రాములు, లక్ష్మిదేవి, రాధిక, నాగరాజు పాల్గొన్నారు.
పూలే–అంబేడ్కర్ ఆశయాలను
అణగదొక్కేలా పాలన
కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ
Comments
Please login to add a commentAdd a comment