డంపింగ్ యార్డులో ఇదీ పరిస్థితి
స్థానిక కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డులోని డంపింగ్ యార్డుకు ప్రతి నిత్యం 88 వాహనాల ద్వారా సుమారు 106 మెట్రిక్ టన్నుల తడి, పొడిచెత్తను మున్సిపల్ అధికారులు తరలిస్తున్నారు. ఇందులో సుమారు పది మెట్రిక్ టన్నుల వరకు కంపోస్టు యూనిట్ షెడ్డుకు, 12 మెట్రిక్ టన్నులు పొడి చెత్తను రీసైక్లింగ్ చేసే డీఆర్‌సీసీకి పంపిస్తున్నారు. మిగిలిన 84 మెట్రిక్ టన్నుల మిక్స్‌డ్ వేస్టేజీని డంపింగ్ యార్డులోని బహిరంగ ప్రదేశంలో వదిలేస్తున్నారు. ఇందులో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లే ఉంటున్నాయి. ఇవి భూమిలో ఇంకిపోక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చివేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment