గోధుమపిండి అక్రమంగా దిగుమతి
జడ్చర్ల: పట్టణంలోని కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లో మాత్రమే విక్రయించే గోధుమపిండిని అక్రమంగా దిగుమతి చేసుకుంటుండటంతో ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విక్రయించడానికి ఉద్దేశించబడినది కాదని సదరు కంపెనీలు గోధుమపిండి పాకెట్లపై స్పష్టంగా రాసినా.. ఆ ఉత్పత్తులను వ్యాపారులు అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణలో విక్రయించే 5 కిలోల గోధుమపిండి పాకెట్ ధర రూ.365 ఉండగా.. అక్రమంగా దిగుమతి చేసుకున్న పాకెట్లపై రూ.254 ఉంది. అంతేగాక జీఎస్టీ చెల్లించకుండా దిగుమతి చేసుకోవడంతో పన్నుల లాభం కలిసి వస్తుంది. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇలా వెలుగులోకి..
జడ్చర్లలోని ఓ హోల్‌సేల్ వ్యాపారి బుధవారం గోధుమపిండి 5 కిలోల పాకెట్ల లోడ్‌ను అక్రమంగా తెప్పించారు. లోడ్ పట్టణానికి చేరిన వెంటనే తమ వ్యాపారులకు వాట్సాప్‌లో సమాచారం అందించారు. దీంతో రిటైల్ వ్యాపారులు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని కావాల్సినంత సరుకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఓ డీలర్ మీడియాకు చేరవేశారు. ప్రభుత్వాకి 5 శాతం జీఎస్టీ ఎగ్గొట్టి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గోధుమపిండి అక్రమంగా దిగుమతి
Comments
Please login to add a commentAdd a comment