ఎల్‌ఆర్‌ఎస్‌పై విస్తృత ప్రచారం చేయాలి
భూత్పూర్: మున్సిపాలిటీలోని ప్రజలకు ఎల్‌ఆర్‌ఎస్‌పై విస్తృత ప్రచారం చేపట్టాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2020లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను కమిషనర్ నూరుల్ నజీబ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌కు రూ.1,000 చెల్లించి అప్పట్లో ఖాళీ స్థలం లబ్ధిదారులు తమ ప్లాట్లను రిజస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో ప్రజలకు ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ కల్పిస్తున్నట్లు ప్రచారం నిర్వహించాలని, మున్సిపాలిటీలో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని కమిషర్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment