యూనిఫాంలను నాణ్యతగా కుట్టాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యార్థులకు కుట్టే యూనిఫాంలను నాణ్యతగా కుట్టాలని డీఆర్‌డీఏ ఏపీడీ జొజప్ప అన్నారు. బుధవారం స్థానిక జిల్లా మహిళా సమాఖ్య భవనంలో మహిళలకు కుట్టులో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేసే యూనిఫాంలను మహిళా సంఘాల ద్వారా కుట్టించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా మహిళలకు కుట్టులో శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాస్థాయిలో శిక్షణ పొందిన టీఓటీ శిక్షకులు మండలస్థాయిలో శిక్షణ ఇస్తారన్నాని అన్నారు. ఈ శిక్షణలో యూనిఫాంలు కుట్టడంతో పాటు బట్ట కట్టింగ్, కాజాలు తదితర అంశాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు. కుట్టే క్రమంలో మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎం ఆలూరిచెన్నయ్య, రమేష్ పాల్గొన్నారు.
డీఆర్‌డీఏ ఏపీడీ జోజప్ప
మహిళలకు కుట్టుపై శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment