బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం
మహబూబ్‌నగర్ రూరల్: బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కావాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలో బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఓటుహక్కు బీసీల ఓటు బీసీలకే’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు రాష్ట్రంలో ఉన్నారన్న విషయాన్ని మరిచి కులగణనలో తప్పుడు లెక్కలు చూయించే ప్రయత్నిస్తుందని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సకల జనుల సర్వేలో ఏ లెక్కలు అయితే చూయించిందో వాటి ఆధారంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అత్యధిక శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. నేషనల్ జస్టిస్ ఫోరం చైర్మన్ నారగోని మాట్లాడారు. సంఘం మహిళావిభాగం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్ మహేంద్ర, రాష్ట్ర కోశాధికారి అరుణ్‌కుమార్, నాయకులు భీమేష్, కృష్ణ, సుజిత్‌యాదవ్, మల్లేష్‌యాదవ్, దీపక్, ఎం.కృష్ణ, రాము పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment