భూమాతను కాపాడుకుందాం
జడ్చర్ల టౌన్: ప్రతిఒక్కరం బాధ్యతగా భూమాతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.సుకన్య పిలుపునిచ్చారు. తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఎస్3 యూనిట్ ప్రత్యేక శిబిరంను ఆమె బుధవారం ప్రారంభించి మాట్లాడారు. భూ మాతను కాపాడుకోవాలంటే మన జీవన విధానంలో సమూలమైన మార్పులు రావాలన్నారు. మన ప్రతిచర్య పర్యావరణ హితంగా ఉండాలన్నారు. శిబిరం 7రోజుల పాటు కొనసాగనున్నందున పర్యావరణ హిత కార్యక్రమాలు చేయాలన్నారు. చెట్లకు పాదులు చేయటం, ఔషధమొక్కల నర్సరీ ఏర్పా టు, చెత్తచెదారంతో కంపోస్ట్ తయారీ, మొక్కలు నాటాలన్నారు. న్నారు.ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–3 ప్రోగ్రాం అధికారి డా.సదాశివయ్య, వైస్ ప్రిన్సిపాల్ నర్మద, 50మంది వాలంటీర్లు పాల్గొన్నారు.
డిగ్రి కళాశాల ప్రిన్సిపాల్ డా. సుకన్య
Comments
Please login to add a commentAdd a comment