రేపు అయ్యప్ప ఆలయంలో రుద్రాభిషేకం
జడ్చర్ల టౌన్: గంగాపురం రోడ్డులోని అయ్యప్ప ఆలయంలో శుక్రవారం అయ్యప్పస్వామి జన్మదినం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు రంజిత్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6గంటలకు విశేషంగా పంచామృత రుద్రాభిషేకం నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.
పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని బీకేరెడ్డి కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు శోభ, కరుణాకర్‌గౌడ్ తమ పిల్లల పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం 20 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు.
జేఎల్ నియామకపత్రం అందుకున్న వెన్నచేడ్ వాసి
గండేడ్: మండలంలోని వెన్నచేడ్ గ్రామానికి చెందిన రాజశేఖర్ బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా జేఎల్(జూనియర్ లెక్చరర్) నియామక పత్రాన్ని అందుకున్నారు. సీఎంతో పోస్టింగ్ ఆర్డర్‌ను అందుకోవడం సంతోషంగా ఉందని రాజశేఖర్ తెలిపారు. ఆయన్ను గ్రామ మాజీ సర్పంచ్‌లు పుల్లారెడ్డి, గోపాల్ అభినందించారు.
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..
నవాబుపేట: విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బుధవారం మండలంలోని మెట్టుగడ్డతండా ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తమ గురువుల పాత్రతో పాటు మండల, జిల్లా స్థాయి అధికారులు పాత్రలు వేసి అందరి మన్ననలు పొందారు. ప్రతిభ కనబర్చినవారికి బహుమతులు అందించారు. పాఠశాల హెచ్‌ఎం విష్ణు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రేపు అయ్యప్ప ఆలయంలో రుద్రాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment