రక్తదాన శిబిరంవిజయవంతం చేయాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల 94వ వర్ధంతిని పురస్కరించుకొని అంతర్జాతీయ స్థాయిలో రెడ్‌క్రాస్, ఎన్‌వైపీఓ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిభిరాన్ని విజయవంతం చేయాలని పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు రక్తదాన శిభిరానికి సంబంధించిన బ్రోచర్‌ను బుధవారం ఆయన పీయూలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, కుమారస్వామి, పర్వతాలు, యాదరాజ్, గాలెన్న, రవికుమర్, ఈశ్వర్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
గండేడ్: మండలంలోని రెడ్డిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు జితేందర్‌రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులను చేపడుతున్నట్లు తెలిపారు. కృష్ణారెడ్డి, అంజిలయ్య, లింగయ్య, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు భగవంతురెడ్డి, రఘురాంరెడ్డి, సాయిలు, వేణుగోపాల్, గోవర్థన్‌రెడ్డి, కృష్ణయ్య, నారాయణ పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్రంలోని ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని టీజీఓ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్‌ను వెంటనే ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన ఆర్థికేతర డిమాండ్లు అన్నింటిని వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు వివిధ రూ పాల్లో నిరసనలు చేపడుతామని హెచ్చరించారు.
ఆశా వర్కర్‌కు న్యాయం చేయాలి
నారాయణపేట టౌన్: జగిత్యాల జిల్లాలో లైంగిక దాడికి గురైన ఆశా వర్కర్‌కు న్యాయం చేయాలని జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ) నాయకురాలు బాలమణి డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆరోగ్యకేద్రం వద్ద ఆశా వర్కర్స్‌తో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన నిదితుడిని కఠినంగా శిక్షించాలన్నారు.
రక్తదాన శిబిరంవిజయవంతం చేయాలి
Comments
Please login to add a commentAdd a comment