వర్గీకరణ తరువాతే ఫలితాలు విడుదల చేయాలి
జడ్చర్ల టౌన్: రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షల ఫతితాలు నిలుపుదల చేసి ఎస్సీ వర్గీకరణ తరువాతే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మందకృష్ణ పిలుపుమేరకు నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలను బుధవారం ప్రారంభించారు.తెలంగాణలోని యావత్తు మాదిగ జాతి సమాజానికి ఇచ్చిన మాటను నిలుపుకోకుండా మాల లీడర్ల ఒత్తిడి మేరకే గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేశారని దీక్షలో పాల్గొన్న నాయకులు ఆరోపించారు. మంత్రివర్గంలోనూ మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తామన్నారు. దీక్షలకు మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పాలాది సారిక సంఘీభావం ప్రకటించారు. ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి జంగయ్య మాదిగ, సీనియర్ నాయకులు కొంగళి నాగరాజు,
ధర్నాచౌక్‌లో..
మహబూబ్‌నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలను, నియామకాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఎఫ్ జాతీయ నాయకుడు పోలే బా లయ్య, బాలరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ ఫలితాలను, నియామకాలను చేపట్టరాదన్నారు.
ఫలితాలను వాయిదా వేయాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు గ్రూప్స్ ఫలితాలు ఇవ్వకూడదని, తక్షణమే ఇచ్చిన ఫలితాలను వాయిదా వేయాలని ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశా రు. పీయూ ముఖద్వారం వద్ద ఏర్పాటుచేసిన ని రసనలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టే క్రమంలో ఇలాంటి పనులు చేయడంతో అన్యాయం చేయడమే అన్నారు.
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు
Comments
Please login to add a commentAdd a comment