మహిళలకే ఆరోగ్య సమస్యలు
మహబూబ్‌నగర్ రూరల్: దేశంలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు మహిళలకే ఉన్నాయని, ప్రతిఒక్క మహిళ తినే ఆహారాన్ని పౌష్టికంగా తీసుకోవాలని సుశ్రుత ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ ప్రతిభ సూచించారు. బుధవారం మండలంలోని మాచన్‌పల్లి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, మాచన్‌పల్లి గ్రామ మహిళా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు–పరిష్కార మార్గాలు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిభ మాట్లాడుతూ భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి అత్యధికంగా మహిళలకే వస్తుందన్నారు. దీన్ని అరికట్టడానికి ప్రతి మహిళా ముందుగానే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ప్రతిరోజు గుడ్లు, పాలు, ఆకు కూరలు అధిక శాతంలో తినాలని సూచించారు. అనంతరం డాక్టర్ ప్రతిభను శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్, మండల మహిళా సమాఖ్య ఏపీఎం మాధవి, సీసీ నాగలక్ష్మి, గ్రామ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం అరుంధతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment