రూపాయి సాయం అందలేదు..
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే తాము సంతకాలు చేశాం. తమ బ్యాంకు ఖాతాల లో మూడు దఫాలుగా పరిహారాన్ని జమ చేస్తామని అధికారులు అప్పట్లో చెప్పారు. ఇప్పటి వరకు రూపాయి జమ చేయలేదు. రోజురోజుకు మార్కెట్ విలువ పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్యాకేజీని రూ.25 లక్షలకు పెంచి ఇవ్వాలి. – రామాంజనేయులు,
నిర్వాసితుడు, ఉదండాపూర్
నిధులు విడుదల కావాలి
ఉదండాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్ అమలు పెండింగ్‌లో ఉంది. గి రిజన తండాలకు అవా ర్డ్ పాస్ కావడంతో రూ.42 కోట్లు నిర్వాసితుల ఖాతాలలో జమయ్యాయి. వల్లూరు, ఉదండాపూర్ ముంపు గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించి అవార్డ్ సిద్ధం చేయాల్సి ఉంది. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆదేశాలతో అక్కడక్కడా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ముందుకు వెళుతున్నాం. – నర్సింగరావు, తహసీల్దార్, జడ్చర్ల
పదవీ త్యాగానికి సిద్ధం
ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతా. అవసరం అనుకుంటే పార్టీని, పదవీని పక్కన పెట్టి నిర్వాసితుల తరఫున నిలబడుతా. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి నుంచి న్యాయం చేస్తామన్న హామీ దక్కింది. అవార్డు పాసైన తండాలకు ఆర్‌అండ్‌ఆర్ పరిహారంతో పాటు ప్లాట్లు త్వరలోనే అందజేస్తాం.
– అనిరుధ్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే
●
రూపాయి సాయం అందలేదు..
రూపాయి సాయం అందలేదు..
Comments
Please login to add a commentAdd a comment