హోలీ సంబరాలు ప్రారంభం
పాలమూరు: హోలీ పండుగ సందర్భంగా మహబూబ్‌నగర్‌లోని పలు చౌరస్తాల్లో గురువారం రాత్రి కాముడి దహనం నిర్వహించారు. ప్రధానంగా బ్రహ్మణవాడి, రాంమందిర్ చౌరస్తాలో స్థానిక మహిళలతో పాటు యువకులు కాముడి దహనం చేశారు.సంజయ్‌నగర్, క్లాక్‌టవర్, పద్మావతి కాలనీ, శ్రీనివాస కాలనీ, మర్లు, సాంబశివ దేవాలయం వద్ద స్థానికులు పెద్ద పెద్ద మంటలు ఏర్పాటు చేసి కాముడి దహనంచేసి, ఆ మంటల చుట్టూ సందడి చేశారు. మరోవైపు రంగులు విక్రయించే దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు యువత ఏర్పాట్లు చేసుకుంది. కాగా.. వేడుకల్లో కాలుష్య కారకాలు లేని సహజసిద్ధమైన, పూల వ్యర్థాలతో తయారు చేసిన రంగులనే ఉపయోగించాలని అధికారులు, వైద్యులు చెబుతున్నారు.
● విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ చౌరస్తాలో నిర్వహించిన కాముడి దహన కార్యక్రమానికి ఎస్పీ డి.జానకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భారీగా ఏర్పాటు చేసిన కాముడిని దహనం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్‌టౌన్ సీఐ అప్పయ్య, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు యాదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు విగ్నేష్‌కాంత్, లక్ష్మీనారాయణ, శ్రీధర్, ప్రభాకర్, మయూరీనాథ్, సుబ్రహ్మణ్యం, బాబుల్‌రెడ్డి పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలో పలు చౌరస్తాల్లో
కాముడి దాహనం
హోలీ సంబరాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment