
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు బలవన్మరణం
నవాబుపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం లింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు .. లింగంపల్లికి చెందిన బాల్‌రాజ్ (26) అనే యువకుడు శుక్రవారం తన బొలెరో గూడ్స్ వాహనాన్ని ఇంటి నుంచి తీసుకొని వ్యవసాయ పొలానికి వె ళ్లాడు. అక్కడే వాహనాన్ని నిలిపి వెనుకభాగంలో ఉన్న కొండికి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
నేత్రదానం
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించిన అనంతరం మృతుడి తల్లి యా దమ్మ తన కుమారుడి కళ్లను దానం చేసేందుకు అంగీకరించింది. దీంతో ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రి సిబ్బంది మృతుడు బాల్‌రాజ్ కళ్లను తీసుకొని కుటుంబ సభ్యులకు ధ్రువపత్రం అందించారు. నేత్రదానం చేసిన ఆకుటుంబాన్ని అందరూ అభినందించారు.
కుమారుడి కళ్లను దానం చేసిన తల్లి
Comments
Please login to add a commentAdd a comment