
జోగుళాంబ క్షేత్రంలో చండీహోమాలు
అలంపూర్ : అలంపూర్ క్షేత్రంలో వెలిసిన శ్రీజోగుళాంబ అమ్మవారి ఐద శక్తిపీఠ ఆలయంలో శుక్రవారం చండీహోమాలు నిర్వహించారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం, పౌర్ణమి, అమావాస్యకు చండీహోమాలు నిర్వహిస్తారు. శుక్రవారం పౌర్ణమిని పురస్కరించుకొని చండీహోమా లు నిర్వహించారు. 117మంది భక్తులు ఈ హో మాల్లో పాల్గొన్నారు. పౌర్ణమి రోజు భక్తులు పెద్దసంఖ్యలో హాజరై శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment