కనులపండువగా అశ్వవాహన సేవ
అడ్డాకుల: మండలంలోని కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద స్వామివారి బ్రహోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి దాటాక స్వామివారికి అశ్వవాహనసేవ నిర్వహించారు. ఆలయం ముందున్న చిన్నతేరును పూజారులు శుద్ధిచేశారు. ఆలయంలో ఉన్న స్వామివారి ఉత్సవ విగ్రహాలను పూజారులు తీసుకొచ్చి చిన్నతేరుపై ఉన్న అశ్వవాహనంపై అలంకరించారు. అనంతరం తేరు ముందు పండితులు హోమం నిర్వహించారు. భక్తులంతా కలిసి ఆలయం ముందున్న తేరును జయజయధ్వానాల మధ్య కొద్ది దూరం ముందుకు తీసుకెళ్లి అశ్వవాహనసేవను ముగించారు. శుక్రవారం ఉదయం స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, బలిహరణ పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. గ్రామంలో ఉన్న స్వామి వారి వెండి ముఖం, నాగపడగలను రాత్రి పల్లికిలో ఉంచి గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. మేళతాళాల సవ్వడిలో వెండి ముఖాన్ని ఆలయానికి తీసుకు వచ్చారు. అనంతరం ప్రధాన ఆలయంలో శివలింగానికి స్వామి వారి వెండి ముఖం, నాగపడగను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రథోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఈఓ రాజేశ్వరశర్మ, ఆలయ ఉద్యోగి అనంతసేన్‌శర్మ, అర్చకులు యాదగిరిశర్మ, తాళ్లపాక రామలింగశర్మ, శివశర్మ, మణికంఠశర్మ, రేవంత్‌శర్మ, వినయ్‌శర్మ, గ్రామస్తులు ఉన్నారు.
హోమం నిర్వహించిన పండితులు
స్వామివారి వెండి ముఖం,
నాగపడగకు ప్రత్యేకపూజలు
Comments
Please login to add a commentAdd a comment