
ఆలయాభివృద్ధికి కృషి చేస్తా : ఎంపీ డీకే అరుణ
అడ్డాకుల: ప్రసిద్ధి చెందిన శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మండలంలోని కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద రూ.7లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాలును శుక్రవారం రాత్రి ఆమె ప్రారంభించి అందులో పూజలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయంలోని శివలింగానికి అర్చకులు అభిషేకం, పూజలు చేయించారు. ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు. రామలింగేశ్వరాలయం చరిత్ర చాలా గొప్పదని, ఇక్కడి భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ నాయకులు తన దృష్టికి తేవడంతో నిధులు మంజూరు చేసినట్లు ఎంపీ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు వస్తున్నందున కమ్యూనిటీ హాలును వినియోగించుకోవాలని సూచించారు. పార్లమెంట్ కన్వీనర్ డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, దేవరకద్ర ఇన్‌చార్జి కొండా ప్రశాంత్‌రెడ్డి, సీనియర్ నాయకుడు సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అరవింద్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రమేష్, టీకే నర్సింహ్మ, నాయకులు గట్టు మల్లేష్ యాదవ్, కొండారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, ఈఓ రాజేశ్వరశర్మ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment