
తుంగభద్ర నదిలో నీటి కుక్కలు
అలంపూర్: తుంగభద్ర నదిలో శిరకుక్కలు
అందరిని ఆకట్టుకున్నాయి. స్థానిక నదుల్లో చేపలు, తాబేలు, నీటి పాములను చూసి ఉంటారు. కానీ అరుదైన నీటి కుక్కలను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అలంపూర్ పట్టణంలోని తుందభద్ర నదీతీరంలో వింత జలజీవులు కనువిందు చేశాయి. దాదాపు 10వరకు ఉన్న జల జీవులు నది ఒడ్డులో గుట్టపక్కన నీటిలో ఈదుతూ కనిపించాయి. కొద్దిసేపు నదిలో ఉన్న గుట్టపైకి వచ్చిన జీవులు ఆతర్వాత
నదిలోకి వెళ్లాయి. స్థానిక మత్స్యకారులు వీటిని శిరకుక్కలు అని పిలుస్తారని తెలిపారు. ఈ జాతి జీవులు శ్రీశైలం డ్యాంలో ఎక్కువగా సంచరిస్తుంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణా–తుంగభద్ర నదులు అడుగంటుతున్నాయి. నదిలో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోవడంతో అక్కడి నుంచి ఈ ప్రాంతానికి ఈ జీవులు వచ్చి ఉంటాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. సాధారణంగా నదిలో పెద్దచేపలు, తాబేలు, నీటిపాములను చూసిన స్థానికులు వింతగా ఉన్న జీవులు కనిపించేవరకు వాటిని తమ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసి సంబురపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment