
విజయవంతం చేస్తాం..
తక్కువ సామర్థ్యాలు ఉన్న విద్యార్థులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఏఐ ల్యా బ్ అందుబాటులోకి తె చ్చింది. ఇందులో ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్‌పై ఏఐ ద్వారా సామర్థ్యాలను పెంచేందుకు వీలుంది. వారి సామర్థ్యం ఎంతో కంప్యూటర్ ఒక అంచనా రిపోర్టు ఇస్తుంది. దాని ఆధారంగా విద్యార్థిని మరింత మెరుగుపర్చే విధంగా చర్యలు ఉంటాయి. పైలెట్ ప్రాజెక్టు కింద శనివారం 10 పాఠశాలల్లో ప్రారంభిస్తున్నాం. జిల్లాలో ఈ కా ర్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తాం. – ప్రవీణ్‌కుమార్,
డీఈఓ, మహబూబ్‌నగర్
సులభంగా ఉంది..
ఉపాధ్యాయులు పుస్తకాలతో ప్రతిరోజు పాఠ్యాంశాల బోధన చేస్తుంటారు. కానీ, ఇటీవల మా పాఠశాలలో కంప్యూటర్ ద్వారా చదువు చెబుతున్నారు. దీంతో పుస్తకాల్లోని అంశాలు చాలా సులభంగా అర్థమవుతున్నాయి. చదవాలనే ఉత్సాహం మరింత పెరిగింది.
– మీనాక్షి, 5వ తరగతి, నారాయణపేట
అర్థం అవుతున్నాయి..
మా తరగతిలో విద్యార్థులు చాలా వరకు పాఠశాలకు గైర్హాజరు అయ్యేవారు. పాఠాలు అర్థం కాక హోంవర్క్ చేసుకుని రాకపోతే టీచర్లు కొడతారని డుమ్మా కొట్టేవారు. విద్యార్థుల స్థాయిని బట్టి కంప్యూటర్‌లో బోధన వేగంగా, నిదానంగా జరుగుతుండటంతో అన్ని విషయాలు బాగా అర్థం అవుతున్నాయి.
– భార్గవ్, 5వ తరగతి, నారాయణపేట

విజయవంతం చేస్తాం..

విజయవంతం చేస్తాం..
Comments
Please login to add a commentAdd a comment