రమణీయం.. రామలింగేశ్వరుడి రథోత్సవం
అడ్డాకుల: మండలంలోని కందూర్ రామలింగేశ్వరస్వామి రథోత్సవం శుక్రవారం అర్ధరాత్రి రమణీయంగా సాగింది. ముందుగా గ్రామం నుంచి రామలింగేశ్వరస్వామి వెండి ముఖం, నాగపడగను మంగళవాయిద్యాలు, డప్పుచప్పుళ్ల నడుమ బాణసంచా కాలుస్తూ భక్తుల శివనామస్మరణతో ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ పూజారులు వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆలయం వెలుపలకు తీసుకొచ్చి అలంకరించిన రథంపై ఉంచారు. తర్వాత రథం ముందు పోలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించి రథాంగ హోమం చేసి హారతులిచ్చారు. శనివారం తెల్లవారుజామున అశేష భక్తజనం శివనామస్మరణ చేస్తూ మేళతాళాల మధ్య స్వామివారి రథాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో ముందుకు లాగారు. రథం ముందు భక్తులు భజనలు, కోలాటాలు చేస్తూ అందరిని అలరించారు. రథోత్సవానికి వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ రాజేశ్వరశర్మ, గ్రామపెద్దలు నాగిరెడ్డి, శ్రీహరి, రవీందర్‌శర్మ, దామోదర్‌రెడ్డి, రాములు, బుచ్చన్నగౌడ్, దేవన్నయాదవ్, మనోహర్, సత్తిరెడ్డి, అర్చకులు యాదగిరిశర్మ, తాళ్లపాక రామలింగశర్మ, శివశర్మ, మణికంఠశర్మ, రేవంత్‌శర్మ, వినయ్‌శర్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.
కందూర్‌లో మార్మోగిన శివనామస్మరణ
భారీగా తరలివచ్చిన భక్తజనం
రమణీయం.. రామలింగేశ్వరుడి రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment