సంప్‌లో పడి చిన్నారి మృతి
బల్మూర్: అప్పటివరకు అందరిని నవ్విస్తూ ఆడుకుంటున్న చిన్నారి సంప్‌లో పడి దుర్మరణం పాలైన ఘటన మండలంలోని కొండనాగుల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చింత మహేష్, సుస్మిత దంపతులు. వీరికి నాన్సీ(2) అనే కూతురు ఉంది. పక్కనే ఉన్న తాత బాలయ్య ఇంటికి ఆడుకుంటూ వెళ్లింది. అక్కడ చిన్నారిని ఎవరూ గమనించకపోవడంతో ఇంటి ముందు ఉన్న సంప్‌లో పడింది. కొంత సేపటికి గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని సంప్‌లో నుంచి తీయగా అప్పటికే నీళ్లు మింగి ఊపిరాడక మృతి చెందింది. చిన్నారి మృతితో ఆకుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
బావిలో పడి వ్యక్తి..
మిడ్జిల్: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మిడ్జిల్ మండలం వేముల గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల వివరాల మేరకు.. వేములకు చెందిన రేవల్లి చంద్రయ్య (50) గురువారం రాత్రి గ్రామంలో నిర్వహించిన కాముడి దహనం కార్యక్రమానికి వెళ్లాడు. అర్ధరాత్రి 1గంటకు కాముడి దహనం ముగిసిన అనంతరం బుడిద తీసుకుని వస్తుండగా.. గ్రామ సమీపంలోని ఆలయం వద్ద ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో శనివారం గ్రామ సమీపంలోని ఆలయం వద్ద ఉన్న బావిలో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడికి భార్య కళమ్మ, కుమారుడు శివకుమార్ ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం జడ్చర్ల మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్ నాయుడు తెలిపారు.
బైక్ అదుపు తప్పి వ్యక్తి..
ఉండవెల్లి: మండలంలోని అలంపూర్ చౌరస్తా నుంచి చెన్నిపాడుకు బైక్‌పై వెళ్తున్న రవీంద్రనాథ్‌రెడ్డి(38) అనే వ్యక్తి పెద్దపోతులపాడు స్టేజీ సమీపంలో అదుపు తప్పి కిందపడటంతో తల కు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌పై అలంపూర్ చౌర స్తా నుంచి స్వగ్రామమైన చెన్నిపాడుకు బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బైక్ అదుపు తప్పి కిందపడినట్లు చెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి అంబులెన్స్‌లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
మహిళ ఆత్మహత్యపై
కేసు నమోదు
జడ్చర్ల: మండలంలోని కోల్‌బాయితండాకు చెందిన పాత్లావత్ శారద(45) తన ఇంటిలో శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. సీఐ కథనం మేరకు.. కోల్‌బాయితండాకు చెందిన శారద భర్త శంకర్ ఆరేళ్ల క్రితం మృతిచెందగా ఆమె తన కుమారుడు సంతోష్, కోడలు జ్యోతిలతో కలిసి జీవిస్తుంది. అయితే కొడుకు, కోడలు తనను వేధిస్తున్నారని తన తండ్రి మునావత్ తథ్యుతో వాపోయింది. ఈ క్రమంలోనే శారద ఆత్మహత్యకు కుమారుడు, కోడలు కారణమని అనుమానంతో శనివారం ఆమె తండ్రి ఫిర్యా దు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
సంప్‌లో పడి చిన్నారి మృతి
సంప్‌లో పడి చిన్నారి మృతి
Comments
Please login to add a commentAdd a comment