షార్ట్ సర్క్యూట్‌తో వస్త్ర దుకాణం దగ్ధం
మక్తల్: షార్ట్ సర్క్యూట్‌తో వస్త్ర దుకాణం దగ్దమైన ఘటన మక్తల్ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఊట్కూరు మండలం తిప్రాస్‌పల్లికి చెందిన అశోక్ మక్తల్‌లోని సంగంబండ రోడ్డులో బట్టల షాపు నిర్వహిస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి 8 గంటలకు షాపును మూసివేసి ఇంటికి బయలుదేరారు. అతడు వెళ్లిన కొద్ది సేపటికే షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అశోక్ అక్కడికి చేరుకొని ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్‌స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే దుకాణంలోని సగానికి పైగా వస్త్రాలు కాలిపోయాయి. దాదాపు రూ. 3లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయారు. దగ్ధమైన షాపును సీఐ రాంలాల్, ఎస్‌ఐ బాగ్యలక్ష్మీరెడ్డి పరిశీలించారు.
రూ. 3లక్షల ఆస్తినష్టం
Comments
Please login to add a commentAdd a comment