ఎన్నాళ్లీ అవస్థలు..
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని సిగ్నల్‌గడ్డపై శనివారం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రోడ్డు విస్తరణ పనులు నెమ్మదిగా నడుస్తుండడంతో పాటు రెండు రోజులుగా ఒకే రోడ్డుపై రాకపోకలు సాగుతున్నాయి. శనివారం నుంచి పాఠశాలలకు ఒంటిపూట ప్రారంభమయ్యాయి. రోజువారీ ట్రాఫిక్‌తో పాటు మధ్యాహ్నం స్కూల్ బస్సులు, పాఠశాలల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో సిగ్నల్‌గడ్డపై ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు ఎండలు పెరగటంతో రోడ్డుపై వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నా మున్సిపల్ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని పలువురు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. – జడ్చర్ల టౌన్
ఎన్నాళ్లీ అవస్థలు..
Comments
Please login to add a commentAdd a comment