పరిహారమిచ్చాకే పనులు చేపట్టాలి
జడ్చర్ల: ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు సంబంధించి తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, తదితర పరిహారమిచ్చాకే పనులు చేపట్టాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. శనివారం ఉదండాపూర్ రిజర్వాయర్ కట్టపై కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో నిర్వాసితులు పాల్గొన్నారు. ఇటీవల ఉదండాపూర్‌లో రీసర్వేకు సంపూర్ణంగా సహకరించామని, తమకు పూర్తి స్థాయిలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పెంచి తమకు అందజేసిన తరువాతనే పనులు మొదలు పెట్టాలని కోరారు. తాజాగా 18 సంవత్సరాల వయస్సు నిండిన వారికి ప్యాకేజీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పనులను అడ్డుకున్నారన్న కారణాలు చూపుతు తమపై పోలీసులు కేసులు నమోదు చేశారని, ఆయా కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. న్యాయపరమైన తమ డిమాండ్లను పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. శ్రీను, వెంకటయ్య, రాములు, ఆంజనేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment