మూడు ఉద్యోగాలు సాధించిన యువతి
తెలకపల్లి: మండలంలోని గడ్డంపల్లి గ్రామానికి చెందిన మద్దెల పుల్లయ్య–బాలమ్మ దంపతుల కూతురు మద్దెల అరుణ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. కుటుంబం, పిల్లలు ఉన్నా పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించింది. 2018లో బీసీ పీజీటీ ఫిజిక్స్‌లో చేరి ఉద్యోగం సాధించింది. 2019లో గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా (డీఎల్) సూర్యపేటలో విధులు నిర్వహించింది. 2025లో ఇటీవల జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలికల కళాశాలలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించింది. ఉద్యోగాలు సాధించడంలో కుటుంబ సభ్యుల కృషి ప్రోత్సాహం ఎంతో ఉందని మద్దెల అరుణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment