ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లో ఈనెల 23న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను శనివారం జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. అండర్–14, 16, 18, 20 విభాగాలతో పాటు పురుషులు, మహిళలకు 100 మీ., 400 మీటర్ల పరుగు, జావెలిన్ త్రో ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో కోచ్‌లు ఆనంద్, సునీల్‌కుమార్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం సంయుక్త కార్యదర్శులు సి.శ్రీనివాసులు, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్తి పన్ను
వసూలుపై దృష్టి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఈ ఆర్థిక సంవత్సరం గడువు దగ్గర పడుతుండటంతో ఆస్తిపన్ను వసూళ్లపై స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దృష్టి పెట్టారు. శనివారం నగరంలోని ఆయా డివిజన్ల పరిధిలో ఎనిమిది బృందాలు తిరిగి ఏకంగా రూ.29 లక్షల మేర రాబట్టగలిగారు. ఇక మార్కెట్ ఏరియాలోని వివిధ దుకాణదారులు నాలుగేళ్లుగా సుమారు రూ.పది లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో తాజాగా పది షాపులను సీజ్ చేశారు. అలాగే పాతబస్టాండు వద్ద ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ సైతం రూ.5.57 లక్షల బకాయి పడింది. దీనిని ఓ ప్రైవేట్ వ్యక్తి లీజుకు తీసుకుని నడిపిస్తుండగా మున్సిపల్ అధికారులు అక్కడికి వెళ్లి సీజ్ చేశా రు. చివరకు ఈనెల 18వ తేదీలోగా మొత్తం చెల్లిస్తామని అతను చెప్పడంతో తిరిగి తెరిచారు. కార్యక్రమంలో ఆర్‌ఓ మహమ్మద్ ఖాజా తో పాటు ఏడుగురు ఆర్‌ఐలు పాల్గొన్నారు.
భవిష్యత్‌లో మరిన్ని
ఏఐ ల్యాబ్‌లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని రాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ల్యాబ్‌ను డీఈఓ ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులకు ఏఐ తరగతులు బోధించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పది ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్‌లను ఏర్పాటు చేసిందన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ఏఐ ల్యాబ్‌లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, సీఎంఓ బాలుయాదవ్, ఎంఈఓ లక్ష్మణ్‌నాయక్, అంజలీదేవి పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.6,871
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,871, కనిష్టంగా రూ.5,869 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు రూ.6,971, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,321, కనిష్టంగా రూ.2,127, జొన్నలు రూ.3,817, ఆముదాలు గరిష్టంగా రూ.6,125, కనిష్టంగా రూ.6,060, పత్తి రూ.5,300 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో కందులు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,041గా ఒకే ధర నమోదైంది.
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
Comments
Please login to add a commentAdd a comment