మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి
మిడ్జిల్: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం సాయంత్రం మిడ్జిల్‌లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల ద్వారా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాల్లోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలకోసం ప్రవేశపెట్టిన ఫలాలు నేరుగా ప్రజలకు అందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు బీజేపీ వారై ఉండాలని సూచించారు. ఇది జరగాలంటే బీజేపీ గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్ కు చెందిన వెంకటయ్య, బుచ్చయ్య, భీమయ్య, బాలమల్లయ్య, తదితరులు ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, నాయకులు జనార్ధన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, తిరుపతి, నరేష్‌నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment