రిమోట్ కంట్రోల్‌తో ఆక్సిజన్..
పీయూ మ్యాథ్స్ విభాగంలో పేటెంట్ రైట్స్ దృష్టిసారించింది. ఇందులో డిజైన్ విభాగంలో శ్వాసకోశ రోగులకు ఆక్సిజన్ థెరపీ అందించేందుకు రిమోట్ కంట్రోలర్ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ రూపొందించారు. ఇందులో పేషెంట్ ఆరోగ్యం, పరిస్థితి తదితర అంశాలను కాన్సన్‌ట్రేటర్ పరిశీలించిన తర్వాత రోగికి ఆక్సిజన్ అందిస్తుంది. అయితే రోగికి మ్యానువల్ పద్ధతిలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేషన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండే నేపథ్యంలో కేవలం రిమోట్ కంట్రోల్ ద్వారా ఆక్సిజన్‌ను అవసరం మేరకు అందిస్తే ఇబ్బందులు తప్పనున్నాయి. ఇందులో పలు యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు శంకర్‌రావు, మధు, భారతి, సత్తమ్మ, లిపిక, అరుంధతి పాలుపంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment