మైనార్టీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: మైనార్టీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 మైనార్టీ గురుకుల కళాశాలలు కొనసాగుతుండగా.. వీటిలో 10 బాలుర, 10 బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. కాగా.. మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025– 26 ప్రవేశాల కోసం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31 వరకు ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో..
ఉమ్మడి జిల్లాలోని 20 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1,600 సీట్లు ఉన్నాయి. వీటిలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెండు ఒకేషనల్ మైనార్టీ బాలికల– 2 గురుకుల జూనియర్ కళాశాల (అడ్వాన్స్ అండ్ టాక్సేషన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ), బాలుర– 3 జూనియర్ కళాశాలలో (ఎంఎల్‌టీ, కంప్యూటర్ సైన్స్) 80 సీట్లు, మిగతా 18 జనరల్ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో చెరో 80 సీట్లు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో 20 కాలేజీలు.. 1,600 సీట్లు
ఈ నెల 31 వరకు
దరఖాస్తులకు అవకాశం
నాణ్యమైన విద్య..
మైనార్టీ గురుకుల కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందిస్తున్నాం. విద్యార్థులు కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రవేశాలకు సంబంధించి మిగతా సమాచారాన్ని సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలి.
– ఖాజా బాహుద్దీన్, ఆర్‌ఎల్‌సీ, మహబూబ్‌నగర్
మైనార్టీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు
మైనార్టీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు
Comments
Please login to add a commentAdd a comment