విస్తృతంగా ప్రచారం..
ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీ ప్రకటించింది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్, పంచాయతీ అధికారులు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రతిరోజు అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పర్యవేక్షిస్తున్నారు. రియల్ ఎస్టేట్, బిల్డర్లు, డాక్యుమెంట్ రైటర్లతో సమావేశాలు నిర్వహించి మరీ ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో స్పందన కనిపించడం లేదు. కలెక్టరేట్‌లో, ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అయినా ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment