ముగిసిన రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
అడ్డాకుల: మండలంలోని కందూరు సమీపంలో స్వయంభూగా వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు ప్రధాన ఆలయంలోని శివలింగానికి అభిషేకం జరిపి.. స్వామివారి వెండి ముఖాన్ని పూలతో అలంకరించి పూజలు చేశారు. గౌరమ్మ ఆలయంలో గౌరమ్మ విగ్రహానికి చీర, పూలతో అలంకరించి పూజలు, రుద్రాభిషేకం, రుద్రహోమం తర్వాత మహాపూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆలయం ముందు ఊరేగించారు. కందూర్‌లో వసంతోత్సవం నిర్వహించిన తర్వాత గ్రామస్తులు ఆలయానికి చేరుకుని త్రిశూలస్నానం కార్యక్రమంలో పాల్గొన్నా రు. పవిత్రమైన కోనేరులో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అర్చకులు యాదగిరిశర్మ, తాళ్లపాక రామలింగశర్మ, శివశర్మ, మణికంఠశర్మ, రేవంత్‌శర్మ, వినయ్‌శర్మ త్రిశూల స్నానం చేయించి ఉత్స వాలను ముగించారు. రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగియగా.. సోమవారం నుంచి జాతర ప్రారంభం కానుంది. ప్రతిఏటా ఉగాది పండగ వరకు జాతర కొనసాగనుండగా.. ఈ సారి శ్రీరామ నవమి వరకు పొడిగించారు. కార్యక్రమంలో ఈఓ రాజేశ్వరశర్మ, గ్రామస్తులు నాగిరెడ్డి, శ్రీహరి, రవీందర్‌శర్మ, దామోదర్‌రెడ్డి, రాములు, బుచ్చన్నగౌడ్, దేవ న్నయాదవ్, మనోహర్, సత్తిరెడ్డి అర్చకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment